ఎట్టకేలకు అమెరికా విమానానికి విముక్తి

0 comments


ముంబాయి : ఎలాంటి అనుమతులు లేకుండా భారత గగతలంలోకి చొ చ్చు కువచ్చిన అమెరికా విమానం ఎట్టకేలకు సో మవారం గాల్లోకెగి రింది. ఉత్తర అమెరికాకు చెంది న బోయింగ్‌ 767 విమానం ఎలాంటి అనుమతి లేకుండా భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చింది. 205 మంది ప్రయాణీకులు , విమాన, మిలిటరీ సిబ్బందితో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ (యూఏఈ)లోని ఫుజిరా నుంచి బ్యాం కాక్‌లోని ఉటాపావోకు బయలు దేరింది.

ఈ విమానం ఆదివారం అక్రమంగా భారత గగనతలంలోకి ప్రవేశించింది. దీంతో ముంబాయి విమానాశ్రయ అధికారులు అత్యవసరంగా విమానాశ్రయంలో దించారు. రవాణాకు చెందిన విమానమైతే (డీజీసీఏ) అనుమతి తప్పని సరిగా తీసుకోవాలి. ఈ విమానంలో మిలిటరీ సిబ్బందిని కూడా తీసుకెళ్తాన్నారు కాబట్టి ఎయిర్‌ ఆపరేటింగ్‌ రూట్‌ క్లియెరెన్స్‌ (ఏఓఆర్‌) తీసుకోవాలి. విదేశీ ఏయిర్‌క్రాఫ్ట్‌లు భారత గగనతలం నుంచి ప్రయాణించాలంటే రెండు సెట్‌ల క్లియెరెన్స్‌లు పొందాలి. కాని, అలాం టివీ ఏమీ లేకుండా ఈ విమానం ఆదివారం భారత గగనతలంతోకి చొచ్చుకువచ్చింది. అమెరికా ఎంబసీ అధికారులు ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని అధికారులతో, ముంబాయిలోను సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. దీంతో విమానం టేకాఫ్‌ అయ్యేందుకు భారత అధికారులు అనుమతించారు

 
Designed by: Radhakrishna | Concept By : Triple Ace Corporates