ముంబైలో అమెరికా సైనిక విమానం

అమెరికాకు చెందిన సైనిక రవాణ విమానాన్ని భారత వాయు సేన అత్యవసరంగా ముంబై విమానాశ్రయంలో దించివేసింది.
తాము దింపివేసిన విమానం ముందస్తు అనుమతి లేకుండఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు తమ గగనతలంలోకి ప్రవేశించిందని ముంబై విమానాశ్రయాధికారులు తెలిపారు.
ఫ్యూజియేరా నుంచి అమెరికా ఎయిర్‌బేస్ ద్వారా బ్యాంకాక్‌కు బయలు దేరిన ఈ బోయింగ్ 242 విమానంలో దాదాపుగా 205 మంది అమెరికన్ సైనికులు ప్రయాణిస్తున్నారు.
అయితే భారత్ మీదుగా ప్రయాణించాల్సిన ఈ విమానం ముంబై సిటీకి సరైన సమాచారం అందించడంలో విఫలమయింది.
స్పందించిన అదికారులు భారత వాయుసేన సహాయంతో విమానాన్ని ముంబై విమానాశ్రయంలో దించివేశారు.
ఇది చార్టర్డ్ విమానమని, అమెరికా ఎయిర్‌బేస్ నుంచి బ్యాంకాక్ వెళుతోందని, కొద్ది రోజుల క్రితం ఇలాగే ఓ అమెరికా విమానం ఇలాగే వెళ్ళడంతో ముంబై విమానాశ్రయంలో దింపేసి పరీక్షించి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా విమానాశ్రయాధికారులు తెలిపారు.

1 comments:

Ajay Samrat said... / October 19, 2009 at 5:10 PM  

thets the power of indian airfource..
let american know this

Post a Comment

 
Designed by: Radhakrishna | Concept By : Triple Ace Corporates